కలెక్టర్‌ ఇంట్లో దెయ్యం..

devil-in-collecter-amrapali-home

కలెక్టర్ ఇంట్లో దెయ్యం ఏమిటి..? అని ఆశ్చ్యర్యపోకండి.. ఇంట్లో దెయ్యం ఉందని స్వయానా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి చెప్పారు. ఆమె ఉంటున్న అధికారిక భవనంలోని ఓ గదిలో దెయ్యం ఉందన్న భయంతో ఆ గదిలో నిద్రపోవడమే మానేశారట. ఈ విషయాన్నీ ఆమ్రపాలి ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. అసలు విషయంలోకి వెళితే.. కలెక్టర్ ఆమ్రపాలి ఉంటున్న అధికారిక క్యాంపు కార్యాలయాన్ని 130 ఏళ్ల కిందట ‘జార్జ్‌ పామర్‌’ అనే ఇంజనీర్ భార్య శంకుస్థాపన చేశారట. అయితే ఆ జార్జ్‌ పామర్‌ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో రెండు నెలలు శోధించి.. అతను తెలంగాణకు చెందిన ఇంజనీర్ అని అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేసినట్టు గుర్తించానని చెప్పారు. అయితే ‘గతంలో పనిచేసిన కలెక్టర్లు ఈ భవనం మొదటి అంతస్తులో దెయ్యం ఉందని నాతో చెప్పారు. నేను బాధ్యతలు తీసుకున్నాక పైకి వెళ్లి చూస్తే గదంతా చిందరవందరగా పడి ఉండడంతో దాన్ని సర్ది పెట్టించాను. అయినా కూడా ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతో అక్కడ పడుకోవడానికి సాహసించను’ అని ఆమ్రపాలి సరదాగా సంభాషించారు.