‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ: గీత మెచ్చిన గోవిందం

‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ: గీత మెచ్చిన గోవిందం

నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక, నాగబాబు, వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

దర్శకత్వం : పరుశురాం

నిర్మాతలు : బన్ని వాసు

సంగీతం : గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : మణి కందన్

స్క్రీన్ ప్లే : పరుశురాం

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

విజయదేవరకొండ యూత్ లో తన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న సెల్ఫ్ మేడ్ స్టార్. ప్రయోగాలతో సక్సెస్ లు అందుకున్న విజయ్ కమర్షియల్ గా చేసిన సినిమా ‘గీత గోవిందం ’ . సినిమా టీజర్స్ , పాటలు ఈ సినిమా మీద అంచనాలను పెంచాయి. మరి ‘గీత గోవిందం’ఏంత గా ఆకట్టుకున్నారో చూద్దాం..

కథ:
విజయ్ గోవిందం( విజయ దేవరకొండ) కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తుంటాడు. పద్దతిగా పెరిగిన ఈ కుర్రాడు ఒక రోజు గీత(రష్మికా) ను చూసి ఇష్టపడతాడు. అదే అమ్మాయితో అనుకోకుండా బస్ లో ట్రావెల్ చేస్తూ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన తో గీత దృష్టిలో ఒక ఇడియట్ అవుతాడు. తన చెల్లి ని చేసుకునేది గీత అన్నయ్యే అవడంతో విజయ్ కష్టాలు మొదలవుతాయి. తను మొదటి చూపులో ప్రేమించిన అమ్మాయి తో జరిగిన ఆ సంఘటన తన చెల్లలు జీవితం పాడు కాకుండా ఉండేందుకు విజయ్ జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని గీతను బ్రతిమలాడుతాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలు గీతను విజయ్ కి మరింత దూరం చేస్తాయి. మరి గీత ను ప్రాణంలా ప్రేమించిన విజయ్ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు. గీతా గోవిందం కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగిలిన కథ..?

కథనం:
అర్జున్ రెడ్డి ఇమేజ్ ని బయట కూడా కొనసాగిస్తున్నట్లు కనపడుతన్న విజయ్ దేవరకొండ అలాంటి పాత్రలు మాత్రమే చేస్తే చూస్తారనే టాక్ ని బ్రేక్ చేసింది గీతా గోవిందం. అతనలోని ఆర్టిస్ట్ ఏ పాత్రలోకయినా పరకాయప్రవేశం చేయగలడు అనడానికి విజయ్ గోవిందం పాత్ర ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. హీరోయిన్ వెంట ‘మేడమ్, మేడమ్ ’ అంటూ తిరిగే పాత్రలో విజయ్ దేవరకొండ పూర్తిగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసాడు. రష్మిక గీత పాత్రకు ప్రాణం పోసింది. అంత కమాండింగ్ గా ఆ పాత్రకు న్యాయం చేసింది. అడుగడుగునా కవ్వింపులు, కోపాలు, చిరాకులు వార్నింగ్ లు ఇలాంటి అమ్మాయితో కష్టంఅనుకునేలా చేసిన గీతా పాత్ర ఈ కథకు చాలా ప్రధాన మైనది. నిజం చెప్పాలంటే గీత చుట్టూ తిరిగే గోవిందం కథ ఇది. తనిచ్చే వార్నింగ్ లకు భయపడే గోవిందం చాలా బాగా నచ్చుతాడు. అలాగే ఆ వార్నింగ్ లతో పాటు ఒక్కోసారి అతను ఇచ్చే కౌంటర్స్ మరింత వారి గొడవలను అందంగా మలిచాయి. ఇంకా ఇంకా ఇంకే కావాలే పాట కథలో కలిసిపోయింది. ఇక గీత అన్నయ్య వెతికేది విజయ్ కోసమే అన్న నిజం దాచడానికి ఫస్ట్ హాఫ్ వరకూ ఆ పాయింట్ చుట్టూ బాగా ఫన్ ని వర్క్ అవుట్ చేసాడు దర్శకుడు పరుశురామ్. సెకండ్ హాఫ్ మొదలయిన తర్వాత కూడా అలాంటి సన్నివేశాలే రిపీట్ అవడంతో గోవిందం కథ కాస్త డల్ అయ్యింది. హీరోయిన్ ఇంకా ఎంత సేపు కొప్పడుతుంది అనే మూడ్ ని బ్రేక్ చేయడానికి కాస్త టైం తీసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత హీరోయిన్ సైడ్ నుండి మొదలైన ప్రేమకథ చాలా ఎమోషనల్ గా మారింది. అయినా తన క్యారెక్టర్ ని మార్చుకోకుండా తన ప్రేమను చూపించడం మొదలు పెడుతుంది గీత కానీ అక్కడ పరుశురామ్ తీసుకున్న టర్న్ ఎవరూ ఊహించరు. పరుశురామ్ హీరో క్యారెక్టర్ తో చెప్పించిన రీజన్ కూడా చాలా సెన్సిబుల్ గా అనిపించింది. క్లైమాక్స్ కి ముందు వచ్చిన వెన్నెల కిషోర్ మూలాలు మర్చిపోని ఆదర్శవంతమైన ఎన్నారై గా బాగా నవ్వించాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అతను చాలా ఆదర్శం కానీ అతని పనులు మాత్రం బాగా ఫన్ జనరేట్ చేసాయి. చాలా రోజులు తర్వాత సుబ్బారాజు ఒక డీసెంట్ రోల్ లో మెప్పించాడు. గీత అన్నయ్య పాత్రను హుందాంగా ప్రజెంట్ చేసాడు. రెగ్యులర్ అరుపులను దాటి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ, రష్మిక ల చేసిన మ్యాజిక్ పై ఆధార పడింది. వారి గొడవలు, అలకలు.. గీతను భరించే గోవిందం పలికించే నవ్వులు ఇలాంటివి ఈ ప్రేమకథ ను నవ్వులతో నింపాయి. రష్మిక నటన ఈ సినిమా ప్రధాన బలంగా మారింది. ఇమేజ్ ని ఊహించుకోకుండా విజయ్ క్లైమాక్స్ లో చేసిన అల్లరి గీతా గోవిందం ను మరింత సరదాగా మార్చింది. నిత్యా మీనన్, అనుఇమ్మానుయేల్ అదనపు ఆకర్షణగా కథలో కనపడతారు. నాగబాబు పాత్ర బాగుంది కానీ ప్రేక్షకులకు అలవాటయిన అతని గొంతు కాకపోవండతో ఆ పాత్రకు అలవాటు పడటానికి టైం పడుతుంది. గోపీ సుందర్ ఇచ్చిన స్వరాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందంగా ఈ ప్రేమకథను మార్చాయి. గీతా ఆర్ట్స్ ని వచ్చిన ఈ రోమాంటిక్ కామెడీ సినిమా యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి.

చివరిగా:
గీత మెచ్చిన గోవిందం అందరికీ నచ్చుతాడు

  • కుమార్ శ్రీరామనేని