లారీ ఢీకొని ఒకరు మృతి

road accident in shamirpeta hyderabad

హైదరాబాద్ శామీర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ ఒక్కసారిగా ఆపడంతో.. వెనుక వస్తున్న స్కూటీ వాహనం బలంగా లారీని ఢీకొట్టింది. స్కూటీ పూర్తిగా లారీ టైరులోకి చొచ్చుకుపోవడంతో.. రాపిడి జరిగి పెట్రోల్ ట్యాంక్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో వెనకాలే వస్తున్న ఆటోకూ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.