ఇద్దరు మహిళల స్వలింగ సంపర్కం.. దోషులుగా తేల్చిన కోర్టు

two-muslim-women-whipped-malaysia-conviction-lesbian-acts

స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మలేషియా మహిళలను దోషులుగా తేల్చింది కోర్టు. స్వలింగ సంపర్కం నేరమంటూ.. ఒక్కొక్కరికి ఆరు కొరడా దెబ్బలు, రూ. 56 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. మలేషియా తెరంగను రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు గత ఏప్రిల్‌ నుంచి స్వలింగ సంపర్కానికి ఒడిగట్టారు. దీంతో వారిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో మంగళవారం తీర్పు వెలువరించిన కోర్టు స్వలింగ సంపర్కం నేరమని పేర్కొంటూ.. వారికి కొరడా దెబ్బలు, జరిమానా విధించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముహమద్‌ ఖాస్మీజాన్‌ అబ్దుల్లా వెల్లడించారు. ఇదిలావుంటే ఈ తీర్పును మలేషియాలోని ఎల్‌జీబీటీ కమ్యూనిటీ వ్యతిరేకిస్తోంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం సరికాదని.. ఇది ఎల్‌జీబీటీ కమ్యూనిటీపై వివక్ష చూపుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -