పోలీస్ స్టేషన్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సతీష్‌ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్‌కి ప్రయత్నించాడు. పెట్రోల్‌ పోసుకుని ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు. క్షణాల్లోనే మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. మట్టి చల్లి అతని ఒంటిపై మంటలు ఆరేలా చేశారు. ఐతే.. అప్పటికే ఒళ్లంతా కాలిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తనపై బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న మనస్తాపంతోనే అతను సూసైడ్‌కి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అటు.. పోలీసులు సతీష్‌ను వేధించినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.