మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌

atal-bihari-vajpayee-health-live-updates-aiims-says-former-pm-still-critical-continues-to-be-on-life-support

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయీని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ, వాజ్‌పేయీ దత్త పుత్రిక నమిత, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, విజయ్‌ గోయెల్‌, ప్రకాశ్ జావదేకర్‌, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు ఇవాళ ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. ప్రధాని మోదీ ఇవాళ మరోసారి వాజ్‌పేయీని పరామర్శించడానికి ఎయిమ్స్‌కు రానున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయీకి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -