ఒక్క ఓటు కోసం ప్రధాని పదవినే వదిలేశారు

నోట్లు ధారపోసి ఓట్లు కొనే రోజులివి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోడానికి రాజకీయ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారు. కానీ వాజ్‌పేయి అత్యున్నత విలువలకు కట్టుబడ్డారు. 1996లో మొదటిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 13 రోజులకే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక రెండోసారి 1998లో ప్రధాన మంత్రిగా వాజ్‌పేయి బాధ్యతలు చేపట్టారు. ఈసారి 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. అది కూడా ఒక్క ఓటు తేడాతో. వాజ్‌పేయి సర్కారుకు జయలలిత నాయకత్వంలోని AIADMK పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో 1999 ఏప్రిల్ 17న విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న వాజ్‌పేయి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు.

అధికార పార్టీగా ఒక్క ఓటు కొనడం అసాధ్యమేమీ కాదు. కానీ అత్యున్నత రాజకీయ విలువలకు కట్టుబడిన వాజ్‌పేయి ఆ పనిచేయలేకపోయారు. ప్రతిపక్షంలో కూర్చుని ప్రజాస్వామ్య విలువలను గౌరవించారు. ఇక 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టారు. ప్రధాన మంత్రిగా వాజ్‌పేయి 2004 వరకు అధికారంలో ఉన్నారు.