శుభలేఖలు పంచడానికి వెళ్లి.. పెళ్లి కుమారుడు అదృశ్యం

bride missing in vijayawada

విజయవాడ టూటౌన్‌లో పెళ్లి కొడుకు అదృశ్యం కావడం కలకలం రేపింది. శుభలేఖలు పంచేందుకు ఈనెల 14వ తేదీన బయటకు వెళ్లిన నాగేంద్రబాబు తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఇవాళ నాగేంద్ర పెళ్లి జరగాలి. పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. ఐతే.. సడన్‌గా అబ్బాయి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటో అర్థం కాక పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. నాగేంద్ర తండ్రి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. తమకు ఎవరితోనూ గొడవలు లేవని, తమ కుమారుడు ఏమయ్యాడో తెలియడం లేదని పేరెంట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.