పిక్నిక్ సరదా.. 12 మంది మృత్యువాత

ఆగస్టు పదిహేను శెలవు రోజు కావడంతో స్నేహితులంతా కలిసి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సరిహద్దుల్లోని పోల్ దగ్గరున్న జలపాతం వద్దకు వెళ్లారు. వారంతా ఆనందంగా నీళ్ళతో ఆడుకుంటున్నారు. కొందరు యువకులు ఉప్పొంగుతున్న నదీ ప్రవాహాన్ని ఫోటోల్లో బంధించాలనుకున్నారు.

వరద ఉద్ధృతిని చూసిన మరికొంత మంది అక్కడే ఉన్న రాతిపై భాగాన ఉండిపోయారు. మరో 12 మంది అప్పటికే నీటిలో దిగారు. వరద ప్రవాహ వేగం ఎక్కువ కావడంతో నీటిలో నిలబడ్డవారు జల ప్రవాహ ధాటికి కొట్టుకుపోయారు. రాతిపై చిక్కుకున్న 30 మందిలో 8 మందిని రెస్క్యూ టీం హెలికాప్టర్ సాయంతో రక్షించారు. మిగిలిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గల్లంతైన 12 మంది ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.