పదిమంది మహిళలపై అత్యాచారం.. ఆపై..

molestations-and-robbery-women-car-suresh-arrest-tamil-nadu

రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలను బెదిరించి వారిపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారి వద్దవునన్న నగలు దోచుకెళుతున్నాడో వ్యక్తి. ఎట్టకేలకు అతను పోలీసుల చేతికి చిక్కాడు. చెన్నై, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను కిడ్నాప్‌ చేసి వారిపై అత్యాచారాలు జరుపుతున్నట్లు, అలాగే బంగారు నగలను కాజేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇటీవల 35 ఏళ్ల మహిళ అతనిపై ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులు సదరు మహిళ చెప్పిన విషయాలతో ఆశ్చర్యానికి గురయ్యారు. తనను కారులో తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి కారులోనే తనపై అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. ఆపై తనవద్ద ఉన్న బంగారంతో అక్కడినుంచి పరారయ్యాడని ఆమె పోలీసులకు వివరించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతను కన్నగినగర్‌ కు చెందిన కాల్‌టాక్సీ డ్రైవర్‌గా పనిచేసే సురేష్ అని గుర్తించారు. అతడిపై 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపినట్లు కేసు నమోదయింది. నిన్న(బుధవారం) అత్యంత చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒంటరిగా నడిచివెళ్లే మహిళలను బెదిరించి కారులో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై అత్యాచారం జరుపుతానని ఒప్పుకున్నాడు. అంతేకాదు వారివద్ద ఉండే బంగారు నగలను తీసుకునేవాడినని, ఇప్పటివరకు పదిమంది మహిళలను అత్యాచారం చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు.