ప్చ్.. గీత మిస్సయింది.. తల పట్టుకున్న రాశి

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. గీత గోవిందం హిట్టయ్యేసరికి ఎంత పని చేసానంటూ వాపోతోంది రాశీ ఖన్నా. గీత పాత్ర ఆమెను వెతుక్కుంటూ వెళ్లి తలుపు తట్టింది. గుమ్మం దాకా వచ్చిన గీతను కాదు పొమ్మంది. కోటి రూపాయలకు ఒక్కపైసా కూడా తగ్గనంది. కాస్త తగ్గించుకోమ్మా అంటే కూడా వినలేదు. ఆనక ఇప్పుడు బాధపడుతోంది.

అసలే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘శ్రీనివాస కళ్యాణం’ నిరాశను మిగిల్చింది. లైట్ తీసుకున్న ‘గీత గోవిందం’ హిట్ టాక్‌తో దూసుకుపోతుండడంతో అమ్మడి బాధ అంతా ఇంతా కాదు. మరో నటి లావణ్ త్రిపాఠిని కూడా అనుకున్నారట చిత్ర యూనిట్. అయితే వీరెవర్నీ కాదని రష్మిక మందన తెరపైకి వచ్చింది. గోవిందుడికి నచ్చింది. ప్రేక్షకులను మెప్పించింది.