లింగాన్ని చుట్టుకున్న నాగుపాము.. తండోప తండాలుగా భక్తులు..

శివుని మెడలో కొలువై ఉన్న నాగరాజు లింగం రూపంలో ఉన్న ఆయనను చుట్టేసింది. ఛత్తీస్ గఢ్‌లోని కాంకెర్‌ జిల్లాలోని చిల్హాటీ గోటాపార గ్రామంలోని ఒక మర్రి చెట్టు కింద ఉన్న శివలింగాన్ని ఓ శ్వేత నాగు చుట్టుకుని భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. విషయం తెలుసుకున్న భక్తులు తండోప తండాలుగా వస్తున్నారు. ఇదంతా శివుని మహిమే అంటూ పూజలు చేస్తున్నారు.