వాజ్‌పేయి, ఆయన తండ్రీ ఒకే కాలేజీలో విద్యార్థులుగా..

కొడుకు వాజ్‌పేయి ‘లా’ చదువుతున్నాడు. తనక్కూడా చదువుకోవాలనిపించింది తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయికి. అప్పటికే కృష్ణ బిహారీ పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. చదువుకోవాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డీఏవీ కాలేజీలో చేరిపోయారు. రోజూ తనతో పాటు కాలేజీకి వస్తున్న నాన్నను చూస్తే కొంత భయం.

స్నేహితులతో సరదాగా గడపలేకపోతున్నానన్న ఫీలింగ్. పైగా తండ్రిదీ, తనదీ ఒకే సెక్షన్ కావడం ఇంకా ఇబ్బందిగా అనిపించేది వాజ్‌పేయికి. ఎలా చెప్పాలో తెలియక ఫ్రెండ్స్ దగ్గర వాపోతుండేవారు వాజ్‌పేయి. కుమారుడి పరిస్థితిని గమనించిన కృష్ణ బిహారీ వేరే సెక్షన్‌లోకి మారిపోయి లా కంప్లీట్ చేశారు. ఆ విధంగా తండ్రీ కొడుకులిద్దరూ ఒకే సారి లా పట్టా పుచ్చుకున్నారు.