తప్పిన ఘోర ప్రమాదం..165మందికి తప్పిన ప్రాణాపాయం

ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. 165మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విమానం.. ల్యాండ్ అవుతుండగా రన్‌పై నుంచి జారిపోయింది. ఎయిర్ పోర్టు ఫెన్సింగ్‌ను గుద్దుకుని ఆగిపోయింది.

గురువారం రాత్రి చెనాకు చెందిన జియామెన్ ఎయిర్ లైన్స్ గురువారం రాత్రి మనీలా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్‌ కు ప్రయత్నించింది. గాలివాన జోరుగా కురవడంతో.. ల్యాండింగ్ కష్టమైంది. పైలట్ అనేక సార్లు విఫలమై.. ఎట్టకేలకు ల్యాండింగ్ చేశాడు. అయితే.. రన్‌వే పై భారీగా నీరు చేరడంతో.. విమానం జారిపోయింది. వేగంగా పక్కనే ఉన్న గడ్డి మైదానం వైపు దూసుకెళ్లింది. విమానం ఒక రెక్క నేలకు తగిలింది. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు ఫెన్సింగ్‌ను తాకి నిలిచిపోయింది.

ప్రమాద సమయంలో విమానంలో 157 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమాన ప్రమాదం కారణంగా రన్‌వేను తాత్కాలికంగా మూసేశారు. అమెరికా నుంచి వచ్చే విమానాలను క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో.. పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు పడ్డారు. అటు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -