రెండో వివాహం చేసుకున్న కమెడియన్ జోగినాయుడు

comedian-jogi-naidu-second-marriage-visakhapatnam

టాలీవుడ్ కమెడియన్ జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు టాలీవుడ్ లో కమెడియన్ గా రాణిస్తున్నారు. తొలుత ఓ ప్రముఖ యాంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విబేధాల కారణంగా విడిపోయారు. దీంతో తన స్వగ్రామానికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు జోగినాయుడు.