వాజ్‌పేయిని ఫిదా చేసిన గీత, సీత

‘మనిషన్నోడికి కూసింత కలాపోసన ఉండాల’ అన్న రావుగోపాలరావు మాటని అక్షరాలా నిజం చేశారు అశేష దేశ ప్రజానీకుల అభిమానాన్ని సంపాదించుకున్న అటల్ బిహారీ వాజ్‌పేయి. భువినుంచి దివికెగిసిన రాజనీతిజ్ఞుడు, రాజకీయ దురంధరుడు, తన జీవితాన్నంతా రాజకీయాలకే అంకితం చేసిన అటల్‌లో కూడా ఆరాధించే మనసు, అభిమానించే హృదయం ఉన్నాయన్నది నమ్మలేని నిజం.

బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమామాలిని వాజ్‌పేయి కలల రాకుమారి. ఆమె నటించిన సీత ఔర్ గీత సినిమాను 25 సార్లు చూశారంటే నమ్మగలమా! అంతిష్టం మరి.. అందుకే అన్ని సార్లు చూశారు. గత ఏడాది హేమామాలిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాజ్‌పేయితో మొదటి సారి మాట్లాడినప్పుడు ప్రస్తావనకు వచ్చిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు.

నేనోసారి ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు నాతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం నాకు అర్థమైంది. వాజ్‌పేయి నా అభిమాని అని, 1972లో విడుదలైన తన సినిమా సీతా ఔర్ గీతాని 25 సార్లు చూశారని అందుకే తాను ఎదురుపడినప్పడు ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు హేమామాలిని.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -