వినాయక చవితికి వస్తున్న అర్జున్ ‘‘కురుక్షేత్రం’’

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. ఇమేజ్‌నే ఇంటిపేరుగా మార్చుకున్న అర్జున్ దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన నటుడు.. తన తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తనే హీరోగా 150వ సినిమా ‘కురుక్షేత్రం’ చేశాడు. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారు.

తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీని దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఫ్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అర్జున్ తో పాటు సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.