క్రికెటర్‌పై పదేళ్ల నిషేధం

నాసిర్‌ జంషెడ్‌ (ఫైల్‌ ఫొటో)

బ్యాట్స్‌మన్‌ నాసిర్ జంషేఢ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 10 ఏళ్ళ పాటు నిషేధం విదించింది. నాసిర్‌పై శిక్ష విధించడం ఇది రేండోసారి . గతేడాది డిసెంబర్‌లో అతనిపై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించింది. పీసీబీ అవినీతి నిరోధక శాఖ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు జంషేఢ్‌ పై చర్యలు తీసుకున్నట్లు పిసిబి న్యాయ సలహాదారుడు టాఫజూల్ రిజ్వి తెలిపారు. ముగ్గురు సభ్యుల స్వతంత్ర అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ప్రకారం అతని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 28 ఏళ్ళ జంషేఢ్‌ పాకిస్తాన్‌ తరపున 48 వన్డేలు,18 టీ20లు, రెండు టెస్టులు ఆడాడు .