స్వామి అగ్నివేశ్‌పై మరో దాడి

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై మరోసారి దాడి జరిగింది.దిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని భాజపా కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి నివాళులు అర్పించేందుకు వచ్చిన అగ్నివేశ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు.గతంలోను ఝార్ఖండ్‌లోని పకూర్‌ జిల్లాలో కొందరు వ్యక్తులు అగ్నివేశ్‌పై దాడి చేశారు. స్వామి అగ్నివేశ్‌ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ కొందరు ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఓ వర్గానికి చేందినవారు గత కొద్దిరోజులుగా అతనిపై భౌతికదాడికి యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.