బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ పాస్టర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణపై అరెస్టు కావడం సంచలనంగా మారింది.ఒంగోలులో స్దానిక క్లౌపేట లోని జోసెఫ్ అనే పాస్టర్ నడుపుతున్న ఇండియా ఇవాంజిలికల్ అండ్ రిలీఫ్ ఫెలోషిప్ బాలికల గృహంలో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్న ఆరోపణలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణ చేపట్టింది. విచారణలో వారికి బాలికల నుంచి విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

ఎనిమిదేళ్ళ నుండి పదహారేళ్ళ బాలికల వరకూ 76 ఏళ్ళ వృద్దుడైన పాస్టర్ జోసెఫ్ ఏ విధంగా వేదింపులకు పాల్పడ్డాడో బాలికలు వివరించారు. సాయంత్రం నుండి అర్దరాత్రి వరకూ బాలికలను తన గదిలోనే ఉంచుకునేవాడని, క్లాసులు జరుగుతున్న సమయంలో కూడా తమను బయటకు పిలిపించుకుని సకల సపర్యలు చేయించుకోవటంతో పాటు లైంగిక వేదింపులకు గురి చేసేవాడని తెలిపారు. నీలి చిత్రాలు చూపించి ఆ విధంగా చేయండంటూ భౌతిక దాడులకు పాల్పడే వాడని చెప్పారు. ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవహారంహోంలో జరుతున్న విషయాలను బయట పెడితే ఎక్కడ తమకు వున్న ఆసరా పోతుందో అనే ఆందోళనతో బయటికి చెప్పలేకపోయామని చెప్పారు.జిల్లా చైల్డ్ వెల్ఫైర్ కమిటీ ఫిర్యాదు మేరకూ పోలీసులు జోసెఫ్ నడుపుతున్న సంస్థలపై దాడులు చేశారు. జోసెఫ్ ను ఫోక్సా చట్టం క్రింద అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. హోం లోని 46 మంది బాలికలను బాల సదన్ కు తరలించారు. పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎందుకిలా జరుగుతుంది ఎందుకిల

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -