సమ్మోహన పరిచిన హీరో మరో కొత్త సినిమా..

యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమా నేడు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది.. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వివి నాయక్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ విచ్చేసారు..

కాగా వివి వినాయక్ సినిమాలో వచ్చే మొదటి సీన్ ఫస్ట్ షాట్ కి గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు.. ప్రముఖ రచయిత కెమెరా స్విచ్ ఆన్ చేసారు.. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ వికె, పోసాని కృష్ణ మురళి మరియు ప్రగతి లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -