కుటుంబసభ్యులకు భారం కాకూడదని యువతి ఆత్మహత్య

young-woman-commits-suicide-illness-psr-nellore

నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం సంఘమిత్ర రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువతి ఆచూకి లభ్యమైంది. ఆమె నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన ఏలూరు నర్మద (20) గా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించగా.. వారు దృవీకరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది నర్మద. ఈ క్రమంలో కుటుంబసభ్యులకు భారం కాకూడదని ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నర్మద ఓ ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె తల్లి సంపూర్మ కూడా మేనకూరు సెజ్‌లోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతంలో సంపూర్ణ భర్త రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నర్మద కూడా ఇటీవల అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే తన అనారోగ్యంతో కుటుంబసభ్యులు అవస్థలు పడకూడదని ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -