28 ఏళ్ల కిందట పోయి.. ఇప్పడు కంట్లో దొరికింది

britain-doctors-found-28-years-old-contact-lens-womans-eye

ఓ మహిళ కంట్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల కిందట పోయిందనుకున్న లెన్స్ ఇటీవల కంట్లో ప్రత్యక్షమైంది. బ్రిటన్ కు చెందిన 42 ఏళ్ల మహిళకు కొంతకాలంగా తన ఎడమ కంటిలో నొప్పి ప్రారంభమైంది. అది తీవ్రమవడంతో స్థానిక ఐ క్లినిక్ సెంటర్ కు వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎమ్మారై స్కానింగ్ చేసి కంటిలో కంటికి ఉండే లెన్స్ ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. దాంతో మహిళ సమ్మతితో ఆమెకు ఆపరేషన్ చేసి లెన్స్ ను బయటికి తీశారు. దాన్నిలాబొరేటరీలో పరిశీలించగా అది 28 ఏళ్ల కిందటిదని ఆమెకు చెప్పారు. అంతే సదరు మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే తేరుకుని.. తన గతాన్ని గుర్తు చేసుకుంది. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా అవతలివ్యక్తి కొట్టిన కాక్ తన ఎడమకంటికి బలంగా తగిలింది.అప్పటికే తన కంటికి లెన్స్ అమర్చుకుని ఉంది. కాక్ బలంగా తగలడంతో అది క్రిందపడిపోయి ఉంటుందని భావించింది. ఆ విషయాన్ని అంతటితో మరచిపోయింది. కానీ 28 ఏళ్ల పాటు కంటిలో ఉండి.. ఈ విధంగా బయటపడుతుందని ఊహించలేదని ఆమె వెల్లడించింది.