కేరళలో వరద విలయానికి కారణం ఏంటంటే..

cause of kerala flood

కేరళలో వరద విలయం ఇంకా కొనసాగడానికి సముద్రమే కారణమా అంటే ఔననే చెప్పాల్సి వస్తోంది. ప్రస్తుతం అక్కడ తీర ప్రాంతంలో పరిస్థితుల్ని పరిశీలించిన వాతావరణ శాఖ నిపుణులు ఆసక్తికరమైన అంశాల్ని గుర్తించారు. కేరళలోని వివిధ నదుల్లో నీరంతా అరేబియా సముద్రంలో కలుస్తుంది. కానీ ఈసారి ఆ తీరంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నదుల్లోంచి వస్తున్న నీటిని సముద్రం తీసుకోవడం లేదు. పైగా రివర్స్‌లో కడలి నుంచే నదుల్లోకి ఫ్లో పెరిగింది. వరద నీరు కలవకుండా అట్నుంచి రివర్స్ ఫ్లో ఉండడంతో.. ఎక్కడి వరద అక్కడే నిలిచిపోతోంది. నదులు ఉప్పొంగి ఆ వరదంతా ఊళ్లపై పడుతోంది. ఈ కారణంగానే కేరళ ఇప్పుడు నీళ్లలో నానుతోంది. ఇప్పటికి 10 రోజులైనా ఇంకా సాధరణ పరిస్థితులు నెలకొనలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.