రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న మరో క్రికెటర్‌!

Gautam Gambhir

భారత క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పశ్చిమ దిల్లీ నుంచి గంభీర్‌ పోటీ చేయనున్నట్లు తేలుస్తోంది. భాజపా వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి దిల్లీలో ఎక్కువ స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, క్రికెటర్ గంభీర్‌ని బరిలోకి దించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు దిల్లీకి చెందిన ఓ భాజపా ప్రతినిధి తెలిపారు.