కేరళ వరద బాధితుల కోసం తమిళ హీరో భారీ విరాళం

దేవభూమిగా పేరుగాంచిన కేరళపై ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం జల విలయంలో చిక్కుకుని కష్టాలు పడుతోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఉహించని ఈ విపత్తుతో కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది.వరదలతో నిరాశ్రయిలుగా మారిన ప్రజల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు,పలు రాజకీయ పార్టీలు,సెలబ్రిటిలు ఐటి
కంపెనీలు మీడియా సంస్థలు కేరళ వాసులకు అపన్న హస్తం అందించడం కోసం ముందుకు వస్తున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో ఇళయా ధళపతి వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నకేరళ వాసుల కోసం 14 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్లు సమాచారం