గోవుల కడుపు మాడ్చి…18 లక్షల గడ్డి మేశారు

యాదాద్రి క్షేత్రంలో కాంట్రాక్టర్లు, ఆలయ సిబ్బంది గడ్డి మేశారు. గోవుల కడుపు మాడ్చి.. మూడేళ్లలోనే 18 లక్షల గడ్డి తిన్నారు. పాత రికార్డుల్లో లెక్కలు కదల్చండంతో స్కాం డొంక బయటపడింది.దీంతో ఆలయ అప్పటి ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు ఆలయ ఈవో.

తెలంగాణాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలోని ఆలయ అధికారులు, సిబ్బంధి.. టెంపుల్ కు సంబంధించిన గోశాలలోని ఆవులు, దూడలు మెసే గడ్డి కుంభకోణానికి పాల్పడ్డారు. యాదాద్రి ఆలయం పరిధిలొ.. దాదాపు గత 60, 70 సంవత్సరాల నుంచి గోశాలను నిర్వహిస్తున్నారు. ఈ దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలకు ముందు పశువులకు గడ్డి ఆలయ వ్యవసాయ పొలం నుంచె తెచ్చేవారు. కాలక్రమేణా.. యాదాద్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో.. యాదాద్రి పరిసర ప్రాంతంలో పశువులకు గడ్డి లభించకపోవడంతో.. గత ఐదు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్దతిలో గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఈ గోశాలలో కాంట్రాక్ట్ పద్దతిలో గడ్డిని కొనుగోలు ప్రారంభించిన నాటి నుంచి.. గోశాలలో అధికారులు అక్రమాలకు పాల్పడడం ప్రారంభించారు. కాంట్రాక్ట్ పద్దతిలో కొనుగోలు ప్రారంభించిన మొదటిలో పశువులకు పెట్టె గడ్డి తూకంలోని అక్రమాలు వేల రూపాయల్లో కొనసాగిన అక్రమాలు. రానురాను లక్షల రూపాయలకు చేరాయి. గోశాలలో పశువులకు పెట్టె గడ్డి అక్రమాలు భారీ స్థాయికి చేరి అధికారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి..

మరోవైపు.. యాదాద్రి ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వ ఆలయ పునర్నిర్మాణానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో.. యాదాద్రి నరసింహుని ఆలయంలో పూజలు నిర్వహించి సమయంలో ఆలయ గోశాలలోని ఆవుల నుండి పాలు తెస్తారేనే ఉద్దేశంతో గో-సంరక్షణ కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇందులోభాగంగా.. రోజు గోవులకు వేసే గడ్డిలో కూడా దేవస్థానం అధికారులు కక్కుర్తి పడ్డారు. ఆవులు తినే గడ్డి అవినీతి అధికారులకు లక్షల రూపాయల కాసుల వర్షం కురిపించి అధికారుల కాంట్రాక్టర్ల ధనదాహాన్ని తీర్చింది. గోవులకు కొనుగోలు చేసిన గడ్డి ధర, పరిమాణంలో చేతివాటం ప్రదర్శించారు. గోవులను మాత్రం కడుపు నింపకుండా ఎండబెట్టారు. ఆ కుంభకోణం పెరిగి ఇప్పటివరకు.. 18 లక్షల రూపాయలకు చేరుకుంది. కొత్తగా ఆ విభాగానికి బదిలీపై వచ్చిన అధికారికి.. గత రికార్డులు అసలు వాస్తవానికి చాలాతేడా ఉండటంతో అనుమానం వచ్చి.. పైస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా.. పిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు.. 2015 సంవత్సరం నుంచి 2018 వరకు పశుగ్రాసం కొనుగోలు వ్యవహారంపై విచారణ చేపట్టగా.. 2015 సంవత్సరం నుండి 2016 సంవత్సరానికి గాను 65,185 కేజీలు.. 2016 నుండి 2017 కు గాను 1,80,295 కేజీలు.. 2017 నుండి 2018 వరకు 1,27,245 కేజీల గడ్డి తక్కువగా వచ్చిందని తేల్చారు. దీని విలువ సుమారు 17లక్షల 27వేల 245 రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని గుర్తించిన ఉన్నతాధికారులు.. 3 సంవత్సరాల కాలంలో ఆ విభాగంలో పనిచేసిన 3 సీనియర్ అసిస్టెంట్లులకు.. 4 సూపరిడెంట్లకు వివరణ కోరుతూ నోటీసులు అందజేశారు.

మరోవైపు.. ఈ ఘటనపై స్పందించిన ఆలయ ఈవో గీతా.. ఆలయ గోశాలలో గడ్డి కుంభకోణం జరిగిన మాట వాస్తవమే అని అన్నారు. గడ్డి కొనుగోలులో అధికారులు, సిబ్బంధి అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలిందనీ.. గడ్డి కుంభకోణానికి పాల్పడిన సదరు కాంట్రాక్టర్, వారికి సహకరించిన ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలియజేయలని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశామని తెలియజేసామన్నారు. వారి నుంచి వివరణ తీసుకున్న తరువాత పూర్తిస్థాయి విచారణ జరిపి.. వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేసి.. శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గొశాల పశు గ్రాసం ఈ ఘటనపై.. స్థానికులు, హిందు దేవాలయాల పరిరక్షణ సమితి.. రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం ఈ గోశాలలో గడ్డి అవినీతి విషయంలో సీనియర్ అసిస్టెంట్, సూపరిడెంట్ లాంటి వారిని వదిలేసి.. చిన్నస్థాయి ఉద్యోగులకు మాత్రమే నోటీసులు జారీ చేసారనె ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పైస్థాయి ఉన్నతాధికారులు హస్తం లేనిదే.. ఇంత భారీస్థాయి అవినీతికి పాల్పడటం సాధ్యం కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి కుంభకోణంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి.. అవినీతికి పాల్పడిన అధికారులందరిపై కఠినచర్యలు తీసుకొని.. బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు. పవిత్రమైన ఆలయంలో పని చేసుకుంటూ మూగజీవులు తినే గడ్డిలోనే అవినీతికి పాల్పడిన అధికారులు ఆలయంలోని ఇతర శాఖల్లో ఏమేరకు అవినీతి జరుగుతుందో అర్థం అవుతుందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని ఇతర శాఖలపైనా విచారణ జరిపించాలని డిమాండు చేస్తున్నారు. గత ఆరునెలల క్రితం గోశాలలో ఆవులు చనిపోవడానికి కారణం కూడా అధికారుల ధనదాహానికి నాసిరకం గడ్డి కారణం అంటున్నారు. వేలకోట్లతో జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏమేరకు అవినీతి జరుగుతుందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి.. మూగజీవల తినే గడ్డిని మెక్కడంపై సార్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ధనదాహంతో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానికులు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.