ఐరాస మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ కన్నుమూత

Kofi Annan, who has died aged 80

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ కన్నుమూశారు. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఐరాసకు తన సేవలను అందించారు. ఘనాలో దేశంలో జన్మించిన అన్నన్‌ ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. కోఫీ అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైన అన్నన్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.