రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మహిళా వైద్యురాలు

ఓడిషాలోని చత్రపూర్ రైల్వేస్టేషన్‌లో సమిపంలో ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎదురుగా వస్తున్న రైలు కిందకు దూకి ఆత్మహాత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసుల తేలిపారు. తురాయి పట్టపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రఘునాథ్‌దాస్‌ కుమార్తె అర్చనాదాస్‌గా మృతురాలిని పోలీసులు గుర్తించారు కొన్నాళ్ల నుంచి భర్త అర్జున్‌దాస్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళైన నాలుగేళ్ల తర్వాత భర్తతో విభేదాలు రావడంతో అర్చనాదాస్‌ తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.