రింగ్స్ మార్చుకున్న ప్రియాంక, నిక్: ఎంగేజ్‌మెంట్ ఫోటోస్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జొనాస్‌ల గురించిన వార్తలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌తో ఈ వార్తలకు తెరపడింది.

ముంబైలోని ప్రియాంక నివాసంలో అతి కొద్ది మంది సెలబ్రెటీల నడుమ జరిగింది. ప్రియాంక పసుపు రంగు డ్రస్‌లో మెరిసిపోగా, నిక్ కుర్తా పైజామా ధరించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం వేడుకను నిర్వహించారు. ప్రియాంక కజిన్, నటి కూడా అయిన పరిణితి చోప్రా షూటింగులో బిజీగా ఉన్నా ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యింది.

సాయింత్రం ముంబైలోని ఓస్టార్ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ పార్టీ ఇస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు రణవీర్, కరణ్ జోహార్‌లతో పాటు మరికొంత మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.