నటి పారితోషికం.. సినిమాకి 280 కోట్లు.. బాప్‌రే నిజంగా అది డబ్బే

అదృష్ట దేవత తలుపు తడితే అవకాశాలు వస్తాయి. ఒక్క సినిమా క్లిక్ అయినా అవకాశాలు క్యూ కడుతుంటాయి. రాత్రికి రాత్రే స్టార్‌ స్టేటస్ సంపాదించుకుంటారు నటీనటులు. తమ ఇమేజ్‌కి డ్యామేజ్ అవకుండా వచ్చిన అవకాశాలన్నీ ఓకే చెప్పకుండా కాల్షీట్లు లేవంటూ కోట్లు రెమ్యునరేషన్ కోరుకుంటారు. ప్రేక్షకుల్లో వారికున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటారు.

మరి హాలీవుడ్ నటి ఒక్క సినిమాకి 4 కోట్ల అమెరికన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 280 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుందట. స్కార్లెట్ జోహన్సన్ అనే నటి పుచ్చుకుంటున్న పారితోషికమిది. ఆమె నటించిన ఎవెంజర్స్ 2, ఇన్ఫినిటీ వార్ అనే సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇక ఈమె తరువాతి స్థానాన్ని ఏంజెలినా జోలీ ఆక్రమించింది.