హమ్మయ్య ఎట్టకేలకు నిలదొక్కుకున్నారు

3rd-test-virat-kohli-ajinkya-rahane-guide-india-307-day

ఇంగ్లాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలిసారిగా భారత బ్యాటింగ్ లో నిలదొక్కుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు (152 బంతుల్లో 11 ఫోర్లతో 97), వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె (131 బంతుల్లో 12 ఫోర్లతో 81) అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు ఈ ఇద్దరు కెప్టెన్లు. శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ముగిసేసరికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో ఆరు వికెట్లకు 307 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 22 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. వోక్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇక మూడో టెస్టులో భారత్‌ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు తొలిసారి అవకాశమివ్వగా, కుల్దీప్‌ స్థానంలో ఫిట్‌నెస్‌ సంతరించుకున్న బుమ్రా, మురళీ విజయ్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌ బరిలోకి దిగారు.