వాజ్ పేయి చితాభస్మాన్ని సేకరించిన దత్త కుమార్తె నమిత

atal-bihari-vajpayees-daughter-namita-collects-ashes-from-smriti-sthal-to-immerse-them-in-haridwar-today

దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు జరిగిన యమునా తీరంలోని స్మృతి స్థల్ నుంచి ఆయన చితాభస్మాన్ని దత్త కుమార్తె నమిత, ఆమె కూతురు నిహారిక ఈ ఉదయం సేకరించారు. అంత్యక్రియలు జరిగిన మూడో రోజున సంచయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతం నుంచి చితాభస్మాన్ని సేకరించి మూడు కుండల్లో ఉంచారు. వీటిని ప్రేమ్ ఆశ్రమ్ కు తరలిస్తామని, ఆ తరువాత ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని వాజ్ పేయి బంధువులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా‌ కూడా పాల్గొన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -