గీత గోవిందం కలెక్షన్స్..

geetha-govindam-box-office-collections-vijay-deverakonda-and-rashmika-mandanna-starrer-rakes

సాధారణ అంచనాలతో ఈ నెల 15 విడుదలైన గీత గోవిందం సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. విజయ్ దేవరకొండ నటన, రష్మిక అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాలా గ్యాప్ తరువాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూఎస్ లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 731,294 డాలర్లు వసూలు చేసి 1 మిలియన్ మార్కును దాటేందుకు సిద్ధమైంది. నేడు(ఆదివారం) కావడంతో సినిమాకు మాంచి రెస్పాన్స్ వచ్చే అవకాశమున్నట్టు సినీ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.గీత గోవిందం సినిమా మూడు రోజుల కలెక్షన్స్ అయన వెల్లడించారు.బుధవారం $ 400,092, గురువారం $ 198,329, శుక్రవారం $ 132,873, మొత్తంగా..731,29 డాలర్లు వసూలు చేసినట్టు అయన తెలిపారు. ఇదిలావుంటే గీత గోవిందం సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.