కేరళకు వివిధ రాష్ట్రాలు ఎంతెంత విరాళాలు ఇచ్చాయంటే..

How many states have given donations to Kerala?

కేరళలో విపత్తును చూసి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు చలించిపోతున్నాయి. ఆదుకునేందుకు మానవతాసాయంతో ముందుకు వస్తున్నాయి. వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు మహారాష్ట్రలోని పుణె నుంచి బయల్దేరింది. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని పంపిస్తోంది. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ 10కోట్ల సహాయం ప్రకటించారు. హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ 10కోట్లు.. తెలంగాణ సర్కారు 25కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10కోట్ల విరాళం ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 10కోట్ల సాయం అందజేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కేరళ బాధితుల కోసం కోటి విరాళంగా ప్రకటించారు. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా 2 కోట్ల సాయం ప్రకటించింది.

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10కోట్ల ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ 5 కోట్ల సాయం ప్రకటించారు. అలాగే సహాయక చర్యలు అందించేందుకు 245 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం 75బోట్లను కూడా తీసుకెళ్తోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ 20 కోట్ల సాయం ప్రకటించారు. ఇక.. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తారని ఏఐసీసీ తెలిపింది. కేరళ సీఎం విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు… అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కేరళ ప్రజలకు సాయం చేసేందుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు ఇరిగేషన్ ఇంజినీర్లు ముందుకొచ్చారు. ఒక నెలజీతం విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. ఇక.. వరద బాధితులను ఆదుకునేందుకు సినీస్టార్లతో పాటు క్రీడా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం చిరంజీవి 25లక్షలు, రామ్‌చరణ్‌ 25 లక్షలు, ఉపాసన 10లక్షల విలువైన మందులు.. అల్లు అర్జున్‌ 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, మోహన్‌లాల్, మమ్ముట్టి, మహేష్‌బాబు, సూర్య, విజయ్‌ సేతుపతి 25 లక్షల చొప్పున అందిస్తామన్నారు.

మరోవైపు హీరో సిద్ధార్థ్‌ సోషల్‌మీడియా వేదికగా కికీ తరహాలో కేరళ డొనేషన్‌ ఛాలెంజ్‌ ప్రారంభించారు. కేరళ కోసం విరాళాలు అందించాలని కోరారు. తన వంతుగా 10 లక్షలు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు. సిద్ధార్థ్‌ విసిరిన ఛాలెంజ్‌ తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.