కేరళ వరదల ధాటికి కూలిపోయిన బ్రిడ్జి

kerala floods effect steel bridge collapsed

కేరళ వరద కష్టాలు తమిళనాడుకు విస్తరిస్తున్నాయి. కావేరి, వైగై నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కావేరి ఉపనది కొల్లిదంపై తిరుచ్చి దగ్గరున్న పాత స్టీల్ బ్రిడ్జి కూలిపోయింది. కొంత భాగం నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. శ్రీరంగం పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -