పెద్దింటి అమ్మాయిలను ప్రేమలోకి దించి ఆపై వీరు చేసే పని చూస్తే..

love blackmail in hyderabad

ప్రేమ పేరుతో విషాన్ని చిమ్మే ముఠా ఇది. క్యాష్ పార్టీ కుటుంబాలే వీళ్ల టార్గెట్. ఈజీ మనీ కోసం పెద్దింటి అమ్మాయిలను ప్రేమలోకి దించి ఆమె తండ్రిని బ్లాక్ మేయిల్ చేసి కోట్లు డిమాండ్ చేస్తారు. హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కూతుర్ని కూడా అలాగే ట్రాప్ చేశాడు ఈ గ్యాంగ్ మెంబర్ వినీష్. ఆమె తనతో ఉన్న కొన్ని ఫోటోలను తీసుకున్నాడు. వాటిని మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తామని యువతిని బెదిరించాడు. ఆ తర్వాత ఆమె తండ్రికి ఫోన్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారు. కూతురు పరువు కోసం ఏం పాలుపోక కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడా తండ్రి..ఆ తర్వాత పోలీసులు ఆశ్రయించాడు.

ప్రేమ పేరుతో ఆటలాడుతున్న గ్యాంగ్ కోసం సెల్ టవర్ లోకేషన్ సెర్చ్ చేయగా..మూడు వేర్వేరు ప్రాంతాల్లో కనిపించారు. దీంతో గ్యాంగ్ మొత్తాన్ని ఒకేసారి అరెస్ట్ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసిన పోలీసులు..తొలి విడతగా 25 లక్షలు ఇస్తాం రమ్మని బాధితులతో ఫోన్ చేయించారు. వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు 25 లక్షలు తీసుకొన్న తర్వాత సీసీఎస్ పోలీసులు వాళ్లని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలర్టైన గ్యాంగ్ పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిజామాబాద్ హైవే వరకు సినిమా స్టయిల్ లో చేజ్ వారిని పట్టుకున్నారు.

వారి నుంచి 25 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..పర్సనల్‌ ఫోటోలు, డేటా విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.