భారీ భూకంపం.. భయంతో పరుగులు

massive-earthquake-fij

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపంతో పెద్దగా ప్రమాదం లేదని.. పైగా అందరు అనుకుంటున్నట్టు సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఫిజీ కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడం మొదలైందని దాంతో ఇళ్ళలో ఉన్న స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే కొన్నిచోట్ల భూకంపం దాటికి పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.