నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా వరద నీరు

తెలుగు రాష్ట్రాల వరప్రధాయినీ నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీశైలంలో వరదనీరు అధికంగా వచ్చి చేరుతుండడంతో.. దీంతో డ్యాం 6 గేట్లు ఎత్తేశారు. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి 2 లక్షల 87 వేల క్యూ సెక్కుల నీరు వస్తోంది..

సాగర్‌ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 538.9 అడుగులకు చేరింది. అలాగే సాగర్‌లోకి వస్తున్న ఇన్‌ ఫ్లో 2 లక్షల 87 వేల 148 క్యూ సెక్కులు ఉంది. ఔట్‌ ఫ్లో 8 వేల 538 క్యూ సెక్కులు ఉంది. డ్యామ్‌ నీటి విలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 179 టీఎంసీలుగా ఉంది. ఇదే వరద ఉధృతి ఇంకో వారం రోజులు కొనసాగితే.. నాగార్జున సాగర్‌ నిండు కుండను తలపిస్తుంది..

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -