అన్ని రాష్ట్రాల ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్ వార్ రూమ్ భేటీ

rahulgandhi war room meeting in delhi with all states pcc presidents and lp leaders aslo party incharges

పార్టీ పటిష్టతపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దృష్టి పెట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఎల్పీ నేతలు, పార్టీ ఇన్‌చార్జులతో ప్రత్యేకంగా వార్‌ రూమ్‌లో రాహుల్‌ సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని సూచిస్తూ.. కేంద్రం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

మోడీ సర్కార్‌ అవినీతిని జనంలో ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లతో పాటు ముఖ్య నేతలు అశోక్‌ గెహ్లాట్‌, గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్ సహా కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు..

500 కోట్ల రూపాయలు విలువ చేసే విమానాలను 1600 కోట్లకు కొనుగోలు చేశారని రాహుల్‌ ఆరోపణ. ప్రజాధనాన్ని మోడీ దోచుకున్నారని, ఓ కంపెనీకి డబ్బును దోచిపెట్టారని చెప్పారాయన. స్వార్థం కోసం దేశ రక్షణను పణంగా పెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ రాఫెల్‌ కుంభకోణాన్ని బయటపెట్టినా ప్రధాని మాట్లాడటం లేదని.. దానిపై విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతాన్ని మలయాలీలకు వరదసాయంగా అందజేయనున్నారు. అటు శక్తి యాప్‌పై నేతలకు అవగాహన కల్పించారు. శక్తియాప్‌తో కేడర్‌కు కలిగే లాభాలు.. పార్టీ అభివృద్ధికి ఏవిధంగా తోడ్పడుతుందన్నది వివరించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -