‘అదుగో’ వస్తుంది..

ravibabu-adugo-release-date-confirmed

నటుడు, దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జంతువుల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ మొదటిసారి ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ సినిమాను రూపొందించారు రవిబాబు. ఇదివరకే ఈ సినిమాకు ప్రత్యేకమైన ప్రచారానికి తెరతీశాడు రవిబాబు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం చాలాసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ‘అదుగో’ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -