ఆర్టీసీ బస్సు బీభత్సం…తల్లీకొడుకులు దుర్మరణం

వరంగల్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హన్మకొండ అశోక జంక్షన్‌లో పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు కింద పడిపోయిన తల్లీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికుల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.