భార్యతో చాటింగ్ చేస్తున్నాడని హత్య..

vijayawada-suspected-murder-ramanujasharma-update

విజయవాడ కృష్ణలంకలోని ద్వారకానగర్‌ రామానుజయ శర్మ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు… తన భార్యతో వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తున్న శర్మను అనుమానంతో భర్త సాయి శ్రీనివాస్‌ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు… కృష్ణ లంక మెట్లబజార్‌కు చెందిన రామానుజయ శర్మకు బాలాజీనగర్‌కు చెందిన వివాహితతో ఫేస్‌బుక్‌లో పరిచయం అయినట్టు పోలీసులు తెలిపారు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం లేదని పోలీసులు తెలిపారు…

ఇద్దరూ రోజూ చాటింగ్‌ చేసుకుంటూ.. ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో ఎలాక్ట్రానిక్‌ షాపు నిర్వహిస్తున్న వివాహిత భర్త సాయిశ్రీనివాస్‌కు అనుమానం పెరిగింది… ఫోన్‌ను పరిశీలించి రామానుజయశర్మతో చాటింగ్‌ చేస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో అతను శర్మను ఎలాగైనా మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న అతనికి ఫోన్‌చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు.

అప్పటికే అక్కడ సెల్లారులో తన ఐదుగురు స్నేహితులతో కలసి సాయిశ్రీనివాస్‌ ఇష్టానుసారం కొట్టసాగాడు. దీంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో స్నేహితుల మధ్య చిన్న గొడవ అని చెప్పి ద్విచక్రవాహనంపై రామానుజయశర్మను ఎక్కించుకుని తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడే వారు మద్యం సేవించి అతన్ని ఇష్టానుసారంగా కొట్టారు. వారి దెబ్బలకు స్పృహ తప్పడంతో అక్కడ నుంచి వారు ద్విచక్ర వాహనంపై అతన్ని తీసుకుని విజయవాడ వైపు వస్తుండగా.. గన్నవరం బిస్మిల్లా హోటల్‌ సమీపంలోకి రాగానే రామానుజయశర్మ మృతిచెందినట్లు గమనించి రోడ్డుపక్కన పడేసి 108కి ఫోన్‌చేసి పరారాయ్యారు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో 108 సిబ్బంది సైతం వెళ్లిపోయారు.

స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఈ నెల 16న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వతేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త కనిపించడం లేదని భార్య స్వరూప కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గన్నవరంలో మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అదృశ్యమైన రామాంజనేయులు శర్మదేనని నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. మృతుడి కాల్‌డేటాలో సాయిశ్రీనివాస్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేసినట్లు అంగీకరించాడు. హత్యకు సహకరించిన స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయి, ఫరూక్, సతీష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.