వరద బాధితుల్లో నటి అనన్య

actress-family-struck-kerala-floods

గత పన్నెండు రోజులుగా కేరళలో కురుస్తున్న వర్షాలకు.. వరదలు పోటెత్తుతున్నాయి. వరదల ధాటికి వందలమంది ప్రాణాలు కోల్పోగా లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. రెండువారాలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది, కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమను కాపాడండంటూ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. పేద, ధనిక వర్గాలు అన్న బేధం లేకుండా అందరూ వరద బాధితులుగా మారారు. సాధారణ ప్రజలే కాక సినీ తరాలు సైతం వరద ప్రభావాన్ని ఎదుర్కుంటున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం వారి కుటుంబం సురక్షితంగానే ఉండగా.. కొచ్చిలోని నటి అనన్య ఇల్లు నీట మునిగిపోయింది. దీంతో ఆమె తన ఇంటిని ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేసింది. ఈ సందర్బంగా.. తన ఇల్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోయిందని.. కుటుంబ సభ్యులమంతా చాలా భయభ్రాంతులకుగురయ్యామని, అదృష్టవశాత్తు తాము సురక్షితంగా బయటపడి ప్రస్తుతం పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తల దాచుకుంటున్నామని చెప్పింది. తమ లాగే ఏందరో వరదల్లో చిక్కుకుని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని.. వారందరిని రక్షించాలని నటి అనన్య పేర్కొంది