దివిసీమ ప్రాంతాన్ని వణికిస్తున్న పాములు.. ఒక్క రోజే 21 మందికి కాటు

diviseema-in-the-grip-of-snakebites

దివిసీమ ప్రాంతాన్ని పాములు వణికిస్తున్నాయి. దివిసీమ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే 21 మంది పాము కాటుకు గురయ్యారు. విశ్వనాధపల్లికి చెందిన ఓ రైతు మృతి చెందాడు. గత నాలుగు నెలల్లో దివిసీమ ప్రాంతంలో 251 పాము కాటు కేసులు నమోదయ్యాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు సరైన మందులు లేకపోవడంతో.. అనేక మంది రైతు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. అవనిగడ్డ ఏరియా హాస్పిటల్ పాము కాటు కేసులతో నిండిపోయింది. వ్యవసాయ పనుల కోసం పొలాల్లోకి వెళ్లే రైతులు.. కూలీలు పాము కాటుకు గురవుతున్నారు.