బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గీత గోవిందం’

మొన్నటి వరకు అర్జున్ రెడ్డిగా తన హవా కొనసాగించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గోవిందుడిగా కూడా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటున్నాడు. బాలీవుడ్ హీరోల సినిమాలను సైతం పక్కకు పెట్టి తెలుగు ప్రేక్షకులు గోవిందుడికి పట్టం కడుతున్నారు.

విడుదలైన మొదటి రోజే 10 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసి రికార్డులు సృష్టిస్తున్నాడు. హిందీ హీరోలు అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాని, జాన్ అబ్రహం నటించిన సత్యమేవ జయతే సినిమాలు విడుదలైనా ఆ వంక కనీసం చూడనైనా చూడట్లేదు ప్రేక్షకులు.


అందరూ గీత గోవిందం సినిమాకే క్యూ కడుతున్నారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా గోవిందుడిదే పై చేయి.