ఎట్టకేలకు పట్టుబిగించిన టీమిండియా

india-vs-england-hardik-pandya-sparks-england-collapse-as-india-take-control-on-day

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైన కోహ్లీసేన బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ను కేవలం 161 పరుగులకే ఆలౌట్ చేసింది. హార్థిక్ పాండ్యా 5 వికెట్లు తీసి ఇంగ్లీష్ టీమ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 168 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ దూకుడుగా ఆడుతోంది.ఓపెనర్లు తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించగా.. కోహ్లీ , పుజారా నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే 300 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉన్న భారత్ మూడోరోజు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది.