టాలీవుడ్‌లో పరుశురామ్ టైం మొదలైంది

రైటర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పరుశురామ్ గీత గోవింద సక్సెస్ అతని కెరియర్ కొత్త టర్న్ తీసుకుంది. గత సినిమాలు బాగుంది అనిపించుకున్నా అది పూర్తిస్థాయి లో సక్సెస్ కాకపోవడంతో పరుశురామ్ ఇప్పుటి వరకూ సోలో ఫైటే చేసాడు. అందుకే గీత గోవిందం అతని కెరియర్ కి మొదటి బ్లాక్ బస్టర్ ని అందించి స్టార్ డైరెక్టర్‌గా మార్చింది .సినిమాలో పరుశురామ్ రైటింగ్ శైలి అందరినీ ఆకట్టుకుంది. విజయ దేవరకొండ,రష్మికలో ఉన్న కొత్త యాంగిల్‌ను చూపించగలిగాడు. సినిమాలో గీత పాత్రను క్లైమాక్స్‌లో గోవిందం కంటే పది మెట్లపైన నిలబెట్టాడు పరుశురామ్. అదే పాయింట్ గీత గోవిందం సక్సెస్‌కు కారణమైంది. అక్కడి వరకూ ఎంటర్ టైన్ అయిన ప్రేక్షకులు ఆ సన్నివేశం తర్వాత సినిమాను మనసులోకి తీసుకున్నారు. కథనంలో హాస్యం నిండినా, పాత్రలలో గొప్పదనం నింపాడు దర్శకుడు. భార్యను అమ్మను చూసుకున్నంత ప్రేమగా చూసుకోవాలనుకునే హీరో, కనిపించే అల్లరి వెనక గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ పాత్రలను మలచడం తో పాటు అన్నపూర్ణ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ కి కూడా ని కంప్లీట్ గా డిజైన్ చేసాడు దర్శకుడు. అందుకే గీత గోవిందం మనసుకు హాత్తుకునే ప్రేమకథ అయ్యింది. వారం రోజుల్లో 50 కోట్ల గ్రాస్ ని సాధించిన ఈ మూవీ ఈ యేడాది మెమరబుల్ హిట్ గా నిలుస్తుంది. వానలు మొదలైనా గీతా గోవిందం థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ తగ్గక పోవడమే ఈ సినిమా స్టామినాను గుర్తు చేస్తుంది. నెక్ట్స్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ లోనే వరుణ్ తేజ్ తో కమిట్ అయ్యాడు దర్శకుడు.