హ‌డ‌లెత్తించిన కొండ చిలువ‌..నాలుగు కోళ్లను మింగి…

ఓ ఇంట్లో ఉన్న నాలుగు కోళ్ళను కొండ చిలువ విుంగేసినా ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఉండవల్లి గ్రామంలోకి తెల్లవారిజామున వచ్చిన ఓ కొండ చిలువ వరండాలో ఉన్న నాలుగు కోళ్లను మింగేసింది. కోళ్ళ అరుపులు విన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. కొండచిలువను చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కోళ్ళను మింగిన కొండచిలువ వాటిని బయటకు ఉమ్మి వేయడం చూసి వారు భయాందోళనకు గురయ్యారు. తర్వాత కూడా కొండచిలువ అక్కడే తిరుగుతూ ఉండడంతో దీంతో యజమాని కొండ చిలువను మట్టుబెట్టాడు.