వంద మంది పౌరులను నిర్బంధించిన తాలిబన్లు

ఆఫ్గాన్‌ చెందిన వంద మంది పౌరులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారు. బదక్షన్‌, టాఖర్‌ ప్రావిన్స్‌ల నుంచి రాజధాని కాబూల్‌ నగరానికి వెళ్తున్న రెండు బస్సులను ఆపి వంద మంది ప్రయాణికులను ఉగ్రవాదులు అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తాలిబన్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను,భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చెేసుకుని తాలిబన్లు ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.  బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు భద్రతా సిబ్బంది చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -